Saami Saami: న్యూయార్క్ వీధుల్లో పుష్ప సాంగ్ తో యువకుడి నృత్యం.. వీడియో వైరల్

పుష్ప మ్యానియా న్యూయార్క్ వీధులనూ తాకింది. భారత కొరియోగ్రాఫర్ జైనిల్ మెహతా కుర్తా, స్కర్ట్ వేసుకుని పుష్ప సాంగ్ ‘సామి సామి’కి వేసిన స్టెప్పులు అక్కడున్న వారందరి దృష్టిని ఆకర్షించాయి. నెట్ లో ఈ వీడియో వైరల్ గా మారింది. అతడి స్టెప్పులు పూర్తి ఎనర్జిటిక్ గా ఉండగా, అతడి వేషధారణ కూడా ప్రత్యేకంగా ఉండడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. 

మిడ్డీ మాదిరి కుర్తా ధరించగా, దానిపై స్కర్ట్ వేసుకున్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షల మంది చూసేశారు.  జైనిల్ డ్యాన్స్ చేస్తుండగా.. వెనుక నుంచి మన్ హట్టన్ బ్రిడ్జి దర్శనమిస్తోంది. ఏదైనా కొంచెం వినూత్నంగా చేస్తే చాలు అది నేడు సామాజిక మాధ్యమాల సాయంతో లక్షలాది మందికి వేగంగా చేరిపోతోంది. ఇది కూడా అటువంటిదే. ఇదిగో.. వీడియో
Saami Saami
song
dance
choreographer
new york

More Telugu News