ఐపీఎల్ తాజా సీజన్ లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన సన్ రైజర్స్ పేసర్
- 153.1 కిమీ వేగంతో బంతిని విసిరిన ఉమ్రాన్ మాలిక్
- తడబాటుకు గురైన రాయుడు
- ఉమ్రాన్ వయసు 22 ఏళ్లు
- ఉజ్వల భవిష్యత్ ఉందంటున్న మాజీలు
ఇక అసలు విషయానికొస్తే... నేడు సన్ రైజర్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతోంది. టాస్ ఓడిన చెన్నై బ్యాటింగ్ కు దిగగా, ఉమ్రాన్ మాలిక్ ఈ టోర్నీలోనే అత్యంత వేగవంతమైన బంతిని విసిరాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో అంబటి రాయుడికి వేసిన ఆ బంతి 153.1 కిలోమీటర్ల వేగం నమోదు చేసింది. రాయుడు ఆ బంతిని ఆడడంలో తడబడ్డాడు.
22 ఏళ్ల ఉమ్రాన్ తన బౌలింగ్ కు మరింత మెరుగులు దిద్దుకుంటే భవిష్యత్తులో టీమిండియాకు ఓ సూపర్ ఫాస్ట్ బౌలర్ గా ఎదుగుతాడని మాజీలు చెబుతున్నారు.