శశిథరూర్ ని కలిసిన సినీ నటి పూనం కౌర్
- ఏపీలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న పూనమ్
- వైద్య విద్యార్థులతో కలిసి థరూర్ ని కలిసిన పూనమ్
- చేనేతకు సంబంధించిన సమస్యలపై చర్చ
అనంతరం ఈ భేటీకి సంబంధించి శశిథరూర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పూనమ్ కౌర్ తో పాటు విద్యార్థులను కలవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తున్న న్యాయ విద్యార్థుల బృందాన్ని, పూనమ్ ను కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉందని, వారి డిమాండ్ కు తాను పూర్తి మద్దతు పలుకుతున్నానని అన్నారు. జీఎస్టీ వల్ల ఖర్చు పెరిగి చేనేత కార్మికులపై అధిక భారం పడుతోందని చెప్పారు.
