అకీరా తెరంగేట్రంపై ఊహాగానాలు.. స్పష్టత నిచ్చిన రేణు దేశాయ్
- అకీరా బాక్సింగ్ నేర్చుకుంటున్న వీడియోను షేర్ చేసిన రేణు
- సినిమాల్లోకి వచ్చేందుకేనని వార్తలు
- అకీరాకు అలాంటి ఉద్దేశం ఏదీ లేదన్న తల్లి
అకీరా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో అది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అకీరా నటుడిగా మారేందుకే బాక్సింగ్ నేర్చుకుంటున్నాడని కామెంట్ చేశారు. త్వరలోనే అతడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూసింది. దీంతో స్పందించిన రేణు దేశాయ్.. ఈ ఊహాగానాలను కొట్టిపడేశారు. అలాంటి వార్తలు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.