CM Jagan: ఇకపై మీరంతా పార్టీ బాధ్యతల్లోకి వెళతారు: రాజీనామా చేసిన మంత్రులతో సీఎం జగన్

CM Jagan directs former ministers
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో మరికొన్ని రోజుల్లో నూతన మంత్రివర్గం కొలువుదీరనుంది. ఇప్పటివరకు మంత్రులుగా పనిచేసినవాళ్లు ఇవాళ తమ రాజీనామాలను సీఎం జగన్ కు సమర్పించారు. మంత్రులతో చివరి క్యాబినెట్ భేటీ నిర్వహించిన సీఎం జగన్ రాజీనామా చేసిన వారికి దిశానిర్దేశం చేశారు. "మీ అందరి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తొలివిడత అవకాశం ఇచ్చాం. ఇకపై మీరందరూ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతల్లోకి వెళతారు. మీకున్న అనుభవాన్ని పార్టీ కోసం వినియోగించండి. అందరికీ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తాం" అని వెల్లడించారు.
Go Back to Shorts
CM Jagan
Former Ministers
Cabinet
Resignations
Responcibilities
YSRCP
Andhra Pradesh

More Telugu News