ఆర్జీవీ వెనకడుగు!.. డేంజరస్ విడుదలను వాయిదా వేసిన డైరెక్టర్!
- డేంజరస్ సినిమా ప్రదర్శనకు పీవీఆర్, ఐనాక్స్ తిరస్కరణ
- అదే బాటలో మరికొన్ని సినిమా థియేటర్లు
- స్వలింగ సంపర్కం నేపథ్యంలో తెరకెక్కిన డేంజరస్
- త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తానన్న రాంగోపాల్ వర్మ
స్వలింగ సంపర్కం నేపథ్యంలో వర్మ తెరకెక్కించిన ఈ చిత్ర ప్రదర్శనకు పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరికొన్ని థియేటర్లు కూడా ఈ సినిమా ప్రదర్శనకు ముందుకు రాలేదట. ఈ కారణంగానే చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు వర్మ ప్రకటించారు. తనకూ, తన చిత్రానికి జరుగుతున్న అన్యాయంపై అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో పోరాటం చేస్తానని చెప్పిన వర్మ.. త్వరలోనే చిత్రం విడుదలకు మరో తేదీని ప్రకటిస్తానని పేర్కొన్నారు.