రాంగోపాల్ వర్మకు షాకిచ్చిన పీవీఆర్, ఐనాక్స్
- లెస్బియనిజం నేపథ్యంలో వర్మ చిత్రం
- ఈ నెల 8న విడుదల కానున్న డేంజరస్
- ప్రదర్శించలేమన్న పీవీఆర్, ఐనాక్స్
- స్వలింగ సంపర్కులను అవమానించినట్టేనన్న వర్మ
నైనా గంగూలీ, అప్సరా రాణి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ప్రదర్శించలేమంటూ పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ తేల్చిచెప్పేశాయి. తన సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి అనుమతి లభించిన అంశాన్ని ప్రస్తావించిన వర్మ... ఈ రెండు సినిమా థియేటర్లు తన సినిమా ప్రదర్శనకు తిరస్కరించి స్వలింగ సంపర్కులను అవమానించాయంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు.