'అంటే .. సుందరానికీ' ఫస్టు సింగిల్ కి ముహూర్తం ఖాయం!
- వినోదభరిత చిత్రంగా 'అంటే సుందరానికీ'
- నాని సరసన నాయికగా నజ్రియా
- ఈ నెల 6వ తేదీన ఫస్టు సింగిల్ రిలీజ్
- జూన్ 10వ తేదీన సినిమా విడుదల
వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 6వ తేదీన సాయంత్రం 6:03 నిమిషాలకు 'పంచె కట్టు' అంటూ సాగే ఫస్టు సింగిల్ ను విడుదల చేయనున్నారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి.
ఈ సినిమా టైటిల్ తోను .. నాని లుక్ తోను 50 శాతం మార్కులు కొట్టేసింది. ఆచార వ్యవహారాల మధ్య నలిగిపోయే యువకుడిలా నాని కనిపించనుండగా, లీలా థామస్ అనే మోడ్రన్ లేడీగా నజ్రియా ఆకట్టుకోనుంది. ఈ ఇద్దరి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలతో ఈ కథ సరదాగా సాగుతుందని అనిపిస్తోంది.