ఈ టీడీపీ కీలక నేతకు నేడు రెండు పండుగలు
- వేడుకగా టీడీపీ 40 వసంతాల పండుగ
- టీడీపీ ఆవిర్భావం నాడే దేవినేని జననం
- మాజీ మంత్రికి బర్త్ డే విషెస్ చెప్పిన నారా రోహిత్
టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని తెలుగు నేల వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. విదేశాల్లో ఉంటున్న తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు సైతం తమతమ ప్రాంతాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలను హోరెత్తిస్తున్నారు. ఇక ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడలో వేడుకలు ఓ రేంజిలో సాగుతున్నాయి. దేవినేని కూడా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు కుమారుడు, టాలీవుడ్ హీరో నారా రోహిత్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.