హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆది పినిశెట్టి నిశ్చితార్థం.. ఫొటోలు ఇవిగో!
- టాలీవుడ్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో ప్రేమ జంట
- 24వ తేదీన జరిగిన ఆది, నిక్కీ గల్రానీల నిశ్చితార్థం
- ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందన్న ఆది
జీవితంలో ఒకరికొకరు తోడుగా ఉండటం అత్యున్నతమైనదని ఆది పినిశెట్టి తెలిపాడు. రెండేళ్ల క్రితం తాము కలిశామని... ఇప్పుడు ఎంగేజ్ మెంట్ అయిపోయిందని చెప్పాడు. 24వ తేదీన ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని తెలిపాడు. ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు.


