రవితేజతో పోటీపడనున్న నిఖిల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజతో పోటీపడనున్న నిఖిల్!

18 Pages movie update
  • నిఖిల్ తాజా చిత్రంగా '18 పేజెస్'
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • దర్శకుడిగా పల్నాటి సూర్యప్రతాప్ 
  • జూన్ 17వ తేదీన రిలీజ్ చేసే ఆలోచన 
మొదటి నుంచి కూడా నిఖిల్ .. రవితేజ మాదిరిగానే తెరపై చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటాడు. ఆయన మాదిరిగానే వరుస సినిమాలు చేయడానికి ట్రై చేస్తుంటాడు. అలాంటి నిఖిల్ తన తాజా చిత్రంతో రవితేజతో పోటీకి దిగనున్నట్టుగా తెలుస్తోంది. నిఖిల్ తాజా చిత్రంగా '18  పేజెస్' రూపొందుతోంది.

పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. మరో పది రోజుల్లో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకోనుంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాను జూన్ 17వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట. 

అయితే అదే రోజున రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా థియేటర్లకు రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. '18 పేజెస్' తరువాత 'కార్తికేయ 2'ను కూడా నిఖిల్ రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలోను కథానాయిక అనుపమ పరమేశ్వరన్ కావడం విశేషం.
Nikhil
Anupama
18 Pages Movie

More Telugu News