తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు.. ఏప్రిల్ 1 నుంచే అమలు
- గృహ వినియోగంపై యూనిట్‌కు 50 పైసల పెంపు
- పరిశ్రమలకు యూనిట్‌పై రూ.1 పెంపు
- చార్జీల పెంపునకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వం నుంచి తమ వద్దకు వచ్చిన ప్రతిపాదనల మేరకు విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతిస్తున్నట్లుగా కమిషన్ చెప్పడంతో విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడమే తరువాయి విద్యుత్ బిల్లుల మోత మోగనుంది. కమిషన్ వెల్లడించిన మేరకు గృహ వినియోగదారులకు యూనిట్‌పై 50 పైసలు, పారిశ్రామిక వినియోగంపై యూనిట్‌కు రూ.1 పెరగనున్నాయి. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.