Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సరసన సమంత?

Samantha in Shirva Nirvana Movie
షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ జోడీగా సమంత ఒక సినిమా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది నిజమేననే టాక్ బలపడుతూ వస్తోంది. ప్రస్తుతం 'లైగర్' షూటింగులో ఉన్న విజయ్ దేవరకొండ, ఆ తరువాత సినిమాను శివ నిర్వాణతో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వానీని తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో, సమంతను తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. చైతూ - సమంత కాంబినేషన్లో 'మజిలీ' వంటి హిట్ ఇచ్చింది శివ నిర్వాణనే. అందువలన వెంటనే సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. 

లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ను తెరపై గొప్పగా ఆవిష్కరించగలడనే పేరున్న శివ నిర్వాణ, త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. 'యశోద' తరువాత తెలుగులో సమంత చేస్తున్న సినిమా ఇది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సమంత చేసిన 'శాకుంతలం' ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Vijay Devarakonda
Samnatha
Shiva Nirvana Movie

More Telugu News