ఫాంహౌస్ లో మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం
- హరీశ్ సహా హాజరైన మంత్రులు
- ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవిత హాజరు
- ఉద్యోగ నోటిఫికేషన్లు, వ్యవసాయంపై చర్చ
- కొనసాగుతున్న సమావేశం
పాలనాపరమైన అంశాలమీదనే ఈ భేటీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాల నోటిఫికేషన్లు, వ్యవసాయం తదితర అంశాలపై మంత్రులు చర్చిస్తున్నట్టు సమాచారం. సమావేశంలో పాల్గొనాలంటూ ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవితకు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్టు సమాచారం.