ఏడుస్తూ ఎంతదూరం నడిచేదాన్నో నాకే తెలియదు: విద్యాబాలన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏడుస్తూ ఎంతదూరం నడిచేదాన్నో నాకే తెలియదు: విద్యాబాలన్

Jalsa Hindi Movie upadet
  • జోరుగా 'జల్సా' సినిమా ప్రమోషన్స్
  • కొన్ని సినిమాల్లో అవకాశాలు పొందాను 
  • చెప్పకుండానే నిర్మాతలు తప్పించారు
  • నా రూపాన్ని ఎద్దేవా చేశారు
  • నేనేంటన్నది నిరూపించానన్న విద్యాబాలన్  
విద్యాబాలన్ .. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఆమె కనిపిస్తుంటారు. ఆమె అంత నిండుగా .. నిబ్బరంగా ఎందుకు అనిపిస్తారో ఆమె మాటలు విన్న తరువాత అర్థమవుతుంది. తన తాజా చిత్రమైన 'జల్సా' సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ, తన కెరియర్ ఆరంభంలో ఎదురైన సంఘటనలను గురించి ఆమె ప్రస్తావించారు. 

కొంతమంది నిర్మాతలు తమ సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చేవారు. ఆ తరువాత ఆ ప్రాజెక్టు నుంచి నన్ను తప్పించేవారు. ఆ విషయాన్ని ముందుగా నాకు చెప్పకపోవడం .. ఒక నోటీస్ పంపించకపోవడం నాకు చాలా బాధ కలిగించేది. ఒక నిర్మాత నా రూపాన్ని గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. ఆ తరువాత అద్దంలో చూసుకోవడానికి 6 నెలల పాటు భయపడ్డాను. 

ఇలాంటి అవమానాలు ఎదురైనప్పుడు రోడ్డు మీద ఏడుస్తూ అలా నడుచుకుంటూ వెళ్లిపోయేదానిని. అలా ఎంతదూరం నడిచేదానినో నాకే తెలియదు. నన్ను అవమానించినవారే నేను స్టార్ ను అయిన తరువాత నా డేట్స్ కోసం వస్తే ఇవ్వనని చెప్పాను. నిజం చెప్పాలంటే ఈ రోజున నేను ఇంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఆనాటి అవమానాలే" అని చెప్పుకొచ్చారు.
Vidyabalan
Jalsa
Hindi Movie

More Telugu News