రేపే సీఎంగా భగవంత్ ప్రమాణం.. ఏర్పాట్లు ఎలాగున్నాయంటే..!
- భగత్ సింగ్ స్వగ్రామంలో వేడుక
- ఇప్పటికే పూర్తి కావచ్చిన ఏర్పాట్లు
- భారీ ఏర్పాట్లనే చేయించిన మాన్
ఇతర పార్టీల నేతల మాదిరిగా కాకుండా తాను స్వాతంత్య్ర సమర యోధుడు భగత్ సింగ్ స్వగ్రామం ఖత్కర్ కలాన్‌లో సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించిన మాన్.. అందుకోసం భారీ ఏర్పాట్లనే చేసుకుంటున్నారు. ఖత్కర్ కలాన్‌లో ఇప్పటికే మాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడంబరాలకు అల్లంత దూరాన నిలిచే పార్టీగా ఆప్ జనాల్లోకి వెళ్లగా... అందుకు విరుద్ధంగా ఇతర పార్టీ నేతలు చేసే భారీ ఏర్పాట్ల తరహాలోనే మాన్ ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఈ తరహా ఏర్పాట్లపై పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఏమంటారోనన్న మాట కాస్తంత గట్టిగానే వినిపిస్తోంది.