ఫొటోగ్రాఫర్ల బారినుంచి సమంతను కాపాడిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి తొలిసారి సమంత జట్టుకట్టబోతోంది. ఆ ప్రాజక్టు చర్చల కోసం వాళ్లిద్దరూ నిన్న రాత్రి సమావేశమయ్యారు. మీటింగ్ మొత్తం అయ్యాక సమంత బయటకు వెళ్లిపోతున్న సందర్భంలో ఫొటో జర్నలిస్టులు ఆమె ఫొటోల కోసం ప్రయత్నించారు. 

దీంతో వరుణ్ ధావన్.. ఆమెను కాపాడాడు. ఫొటో జర్నలిస్టులనుద్దేశిస్తూ సరదా వ్యాఖ్యలు చేశాడు. ‘‘హేయ్..హేయ్.. జరగండి..జరగండి. ఎందుకు ఆమెను అలా భయపెడుతున్నారు? భయపెట్టకండి ఆమెను’’ అంటూ కామెంట్ చేశాడు. సమంతకు ఎస్కార్ట్ లాగా కారు దాకా వెళ్లాడు. 

హాలీవుడ్ సిరీస్ ‘సిటడెల్’కు ఇండియన్ వెర్షన్ లో ఈ ఇద్దరూ జోడీ కట్టనున్నారు. రాజ్ అండ్ డీకేలు దర్శకత్వం వహించనున్నారు. బ్రిటన్ లో ఇదే సిరీస్ కు ప్రియాంక చోప్రాను నాయికగా తీసుకున్నారు. కాగా, ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తో అభిమానులను అలరించిన సమంత.. ఇప్పుడు ‘సిటడెల్’తో మరింత దగ్గరకానుంది. ఇటీవల ఈ షో గురించి మాట్లాడిన సమంత.. తనకు ఫ్యామిలీ మ్యాన్ 2లో లభించిన రాజీ లాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర మళ్లీ దొరుకుతుందని తాను అనుకోవట్లేదని చెప్పింది.

Samantha
Tollywood
Varun Dhawan
Bollywood

More Telugu News