ఈ దేశాలన్నింటికీ మేమేంటో చూపిస్తాం: రష్యా
- యుద్ధం నేపథ్యంలో రష్యాపై పలుదేశాల ఆంక్షలు
- ఆయా దేశాలకు నొప్పి తెలిసేలా చేస్తామన్న రష్యా
- తాము కూడా ఆంక్షలు విధిస్తామని హెచ్చరిక
ప్రస్తుతం రష్యా ఐదున్నర వేలకు పైగా ఆంక్షలను ఎదుర్కొంటోంది. ఉత్తర కొరియా, ఇరాన్ ల కంటే ఇది ఎక్కువ. రష్యా చాలా వేగంగా, కచ్చితంగా స్పందిస్తుందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి అన్నారు. ఏయే దేశాలపై ఏ ఆంక్షలు విధించాలనే కోణంలో సమాలోచనలు జరుగుతున్నాయని చెప్పారు.