మ‌హిళ‌ల‌కు ప‌ద‌వుల్లో మొదటి స్థానంలో మన ఏపీ: సీఎం జ‌గ‌న్‌

08-03-2022 Tue 15:22 | Andhra
  • 51 శాతం మేర ప‌దవులు మ‌హిళ‌ల‌కే
  • మ‌హిళ‌ల‌కు రాజ‌కీయ సాధికార‌త కోసం య‌త్నం
  • ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాల‌కు హాజ‌రు
మ‌హిళ‌ల‌కు 51 శాతం మేర ప‌ద‌వులు ఇచ్చిన తొలి రాష్ట్రం మన ఏపీనేన‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ఏపీలో ఉన్నంత మంది మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధులు దేశంలోని మరే రాష్ట్రంలో లేర‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ విష‌యంలో దేశంలో ఏపీ నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉంద‌ని జ‌గన్ చెప్పారు. ఈ మేర‌కు ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

ఈ కార్య‌క్ర‌మంలో స్టేజీ మీద‌, స్టేజీ ముందు, స్టేడియం నిండా, త‌న చుట్టూ ఉన్న మ‌హిళ‌లంతా ప్ర‌జా ప్ర‌తినిధులేనని కూడా జ‌గ‌న్ చెప్పారు. గ‌డ‌చిన రెండున్న‌రేళ్లుగా అధికారాన్ని అక్కాచెల్లెమ్మ‌ల కోస‌మే వినియోగించామ‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. మ‌హిళ‌ల రాజ‌కీయ సాధికార‌త కోసం ప్ర‌భుత్వం చర్య‌లు తీసుకుంటుంద‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు.

అంత‌కు ముందు త‌మ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల కోసం ఏం చేసింద‌న్న విష‌యాన్ని వివ‌రిస్తూ జ‌గ‌న్ రెండు వ‌రుస ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్ల‌లో  "మ‌న‌ది మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వమ‌ని చెప్ప‌డానికి ఈ 34 నెల‌ల్లో వారి కోసం ఖ‌ర్చు పెట్టిన 1.18 ల‌క్ష‌ల కోట్ల మొత్తమే సాక్ష్యం. వారి కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు రాజ‌కీయ నియామ‌కాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చ‌ట్టం చేశాం. మ‌హిళ‌ల‌కు ఇంకా మంచి చేయ‌డానికి కృషి చేస్తూనే ఉంటామ‌ని చెబుతూ చిన్నారుల‌కు, అక్క‌చెల్లెమ్మ‌ల‌కు, అవ్వ‌ల‌కు,  మహిళా లోకానికంత‌టికీ హృదయపూర్వక అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు" అని జ‌గ‌న్ పేర్కొన్నారు.
YS JaganAndhra Pradeshwomens day

More Telugu News

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55
..more