నేనూ ఈ కాలేజీ విద్యార్థినే.. గుర్తుకొస్తున్నాయి: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేనూ ఈ కాలేజీ విద్యార్థినే.. గుర్తుకొస్తున్నాయి: రోజా

I am also this college student says Roja
  • తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో వేడుకకు హాజరైన రోజా
  • తాను చదువుకున్న విద్యాసంస్థకే తాను గెస్ట్ గా వెళ్లడం సంతోషంగా ఉందని వ్యాఖ్య
  • తాను చదువుకున్న రోజులు గుర్తుకొచ్చాయన్న రోజా
ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే రోజా రొటీన్ లైఫ్ నుంచి కొంత విరామం తీసుకున్నారు. తిరుపతిలో తాను చదువుకున్న శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారపు సంబరాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాను చదువుకున్న విద్యాసంస్థకే తాను గెస్ట్ గా వెళ్లడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశించగానే తాను చదువుకున్న రోజులు గుర్తుకొచ్చాయని తెలిపారు. 'నేనూ ఈ కాలేజ్ విద్యార్థినే.. గుర్తుకొస్తున్నాయి' అంటూ ఆమె ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Roja
YSRCP
Padmavati University

More Telugu News