CPI Ramakrishna: చంద్రబాబుపై ఉన్న కోపాన్ని అమరావతిపై చూపించారు: సీపీఐ రామకృష్ణ

అమరావతి పట్ల ముఖ్యమంత్రి జగన్ కక్షపూరితంగా వ్యవహరించారని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై కోపం ఉంటే ఆయనపై చూపించాలే కానీ, అమరావతిపై చూపించడం ఏమిటని ప్రశ్నించారు. అమరావతే రాజధానిగా ఉండాలనేది రాష్ట్ర ప్రజల కోరిక అని అన్నారు. 

అభివృద్ధి పేరుతో ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలని సూచించారు. ఇదే సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణపై సెటైర్లు వేశారు. బొత్స ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, అమరావతికి మధ్య జరిగిన న్యాయ పోరాటంలో చివరకు అమరావతినే విజయం వరించిందని రామకృష్ణ చెప్పారు.
CPI Ramakrishna
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Amaravati

More Telugu News