ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపాలని నేనెలా ఆదేశించగలను?: సీజేఐ ఎన్వీ రమణ
- ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని తీసుకురావాలని పిటిషన్
- విచారణ జరిపిన సుప్రీంకోర్టు
- ఓ వీడియో చూశానన్న జస్టిస్ ఎన్వీ రమణ
- సీజేఐ ఏం చేస్తున్నారని అందులో ఓ వ్యక్తి ప్రశ్నించారని వ్యాఖ్య
దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఆదేశించగలమా? అని ప్రశ్నించారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల పట్ల సానుభూతి ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా కలిచివేస్తున్నట్లు తెలిపారు.
తాను సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో చూశానని, అందులో సీజేఐ ఏం చేస్తున్నారని ఒకరు అడిగారని గుర్తు చేసుకున్నారు. అయితే, ఆ యుద్ధాన్ని ఆపాలని తాను పుతిన్ను ఆదేశించలేను కదా? అని ఎన్వీ రమణ అన్నారు.