తమిళనాడు సీఎంకు తెలుగు రాష్ట్రాల సీఎంల విషెస్
- తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే శ్రేణుల వేడుకలు
- ట్వీట్‌తో విషెస్ చెప్పిన ఏపీ సీఎం జగన్
- ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు కూడా స్టాలిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌తో స్టాలిన్‌కు జగన్ బర్త్ డే విషెస్ చెప్పగా.. కేసీఆర్ మాత్రం నేరుగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
స్టాలిన్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. సీఎం స్టాలిన్‌కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వీలు చూసుకుని మరీ స్టాలిన్‌కు కేసీఆర్ ఫోన్ చేయడం గమనార్హం.