Ram: 'ది వారియర్' నుంచి ఆది పినిశెట్టి ఫస్టు లుక్!

  • రామ్ హీరోగా 'ది వారియర్'
  • కథానాయికగా కృతి శెట్టి 
  • ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  
The Warrior New Poster Released

రామ్ హీరోగా దర్శకుడు లింగుస్వామి 'ది వారియర్' సినిమా రూపొందిస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో రామ్ సరసన నాయికగా కృతి శెట్టి అలరించనుంది. ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. 

'మహాశివరాత్రి' సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఆది పినిశెట్టి ఫస్టులుక్ ను వదిలారు. ఆది పినిశెట్టి పాత్రను ఎంత డిఫరెంట్ గా డిజైన్ చేశారు .. ఆయన పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండనుందనేది ఈ పోస్టర్ చూస్తేనే అర్థమైపోతోంది. ఆయన విలనిజం ఏ రేంజ్ లో ఉంటుందన్నది ఆయన లుక్ చెప్పేస్తోంది. 

రామ్ మొదటిసారిగా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. 'రెడ్' సినిమా రిజల్ట్ తో డీలాపడిన రామ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన బోయపాటితో చేయనున్న సంగతి తెలిసిందే.

More Telugu News