Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి కొత్త బాధ్యతలను అప్పగించిన జగన్

Vijayasai Reddy apponted as incharge to all YSRCP affiliates
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జగన్ బాధ్యతలను అప్పగించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి బాధ్యతలు కూడా ఆయనవే. తాజాగా ఆయనకు మరిన్ని బాధ్యతలను అప్పగించారు. వైసీపీకి చెందిన అన్ని అనుబంధ విభాగాలకు విజయసాయిని ఇన్ఛార్జిగా నియమించారు. వైసీపీ జాతీయ అధ్యక్షుడు జగన్ పేరిట ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

మరోవైపు తనను అన్ని అనుబంధ విభాగాల ఇంఛార్జిగా నియమించినందుకు జగన్ కు విజయసాయి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Jagan
YSRCP

More Telugu News