rta: ‘9’ నెంబర్ కావాలి.. ఎంతయినా ఫర్వాలేదంటున్న వాహనదారులు!

crazy competition for fancy numbers
షార్ట్స్‌లో చూడండి
సంఖ్యా శాస్త్రాన్ని విశ్వసించి, ఆచరించే వారు చాలా మందే ఉంటారు. తమ వాహనం కోసం లక్కీ నెంబర్ తో ఉన్న నెంబర్ ప్లేటుకు ఉండే తీవ్ర పోటీయే దీన్ని తెలియజేస్తుంది. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉండే నెంబర్లకు రవాణా శాఖ వేలం నిర్వహిస్తుంటుంది. అన్ని రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) కార్యాలయాల్లో ఎప్పుడూ జరిగే కార్యక్రమమే. వేలంలో ఉంచిన నెంబర్లకు ఎవరు ఎక్కువ ధర చెల్లించేందుకు ముందుకు వస్తే వారికి కేటాయిస్తుంటారు.

ఈ క్రమంలో 9 నెంబర్ కు ఎక్కువ పోటీ ఉంటుంది. అదే సమయంలో ఇతర నంబర్లు కూడా అప్పుడప్పుడు మంచి ధర పలుకుతుంటాయి. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో తాజాగా ఎఫ్ వీ సిరీస్ లో నెంబర్లకు వేలం నిర్వహించారు. టీఎస్09 ఎఫ్ వీ 9999 నెంబర్ ను.. రూ.10,49,999 కు గిరిధారి కన్ స్ట్రక్షన్స్ సంస్థ సొంతం చేనుకుంది. టీఎస్09 ఎఫ్ వీ 0009 నెంబర్ రూ.3,50,005 పలికింది.  టీఎస్09 ఎఫ్ వీ 0001కు రూ.3,50,000..   టీఎస్09 ఎఫ్ వీ 0005కు రూ.2,20,000..   టీఎస్09 ఎఫ్ వీ 0007కు రూ.1,15,000..   టీఎస్09 ఎఫ్ వీ 0006కు రూ.1,10,111 ధర ఖరారైంది.
Go Back to Shorts
rta
khairatabad
fancy numbers
auction

More Telugu News