'ఆర్ఐపీ వైజాగ్ టీడీపీ' అన్న విజయసాయి.. కౌంటర్ ఇచ్చిన అయ్య‌న్న పాత్రుడు

vijaya sai slams tdp
  • ఒక నాయకుడు మరణిస్తే హుందాగా నివాళులు అర్పించాలి
  • నీచమైన కామెంట్స్ చేయడం టీడీపీ నేతలకే సాధ్యం
  • టీడీపీ మానసిక వైకల్యం అర్థ‌మవుతుంది
  • పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన పార్టీ
ఏపీ మంత్రి మేకపాటి గౌత‌మ్‌రెడ్డి హఠాన్మరణంపై అనుమానాలు ఉన్నాయ‌ని, ఆయ‌న‌ మృతిపై సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై విజ‌య‌సాయిరెడ్డి స్పందిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

'ఒక నాయకుడు మరణిస్తే హుందాగా నివాళులు అర్పించాల్సింది పోయి.. నీచమైన కామెంట్స్ చేయడం టీడీపీ నేతలకే సాధ్యం. ఆ పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి మాటలు వింటే...టీడీపీ మానసిక వైకల్యం అర్థ‌మవుతుంది. పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన పార్టీ. ఆర్ఐపీ వైజాగ్ టీడీపీ' అంటూ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

విజ‌యసాయిరెడ్డి ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడు కౌంట‌ర్ ఇచ్చారు. 'గురువింద కూతలు నువ్వే కూయాలి కసాయి! శవం దొరికితే రాజకీయం చేసే జగన్ రెడ్డి అండ్ కో కూడా నీతులు మాట్లాడటం విడ్డురంగా ఉంది' అని ఆయ‌న అన్నారు. గ‌తంలో విజ‌య‌సాయిరెడ్డి చేసిన ఓ ట్వీటునూ ఈ సంద‌ర్భంగా అయ్య‌న్న పాత్రుడు పోస్ట్ చేశారు.
Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
Mekapati Goutham Reddy

More Telugu News