తెలంగాణ సీఎం కేసీఆర్ కు తగిన సామర్థ్యాలు ఉన్నాయి: శివసేన ఎంపీ సంజయ్ రౌత్
- అందరినీ కలుపుకుని పోగలరు
- రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు
- ఆయనకు నాయకత్వ సామర్థ్యాలు ఉన్నాయి
‘‘కే చంద్రశేఖర్ రావు ఎంతో కష్టపడి పనిచేసే రాజకీయ నేత. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అందరికనీ కలుపుకునిపోయే, నాయకత్వం వహించే సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి’’ అని సంజయ్ రౌత్ అన్నారు. ఇద్దరు సీఎంలు (కేసీఆర్,ఠాక్రే), ఇతర రాజకీయ నాయకులు త్వరలోనే సమావేశమై చర్చలు నిర్వహిస్తారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఓటమి పాలు కాబోతోందని ఈ సందర్భంగా రౌత్ అన్నారు.