అచ్చం మహేశ్ బాబులా కళావతి పాటకు కూతురు సితార అదిరేటి స్టెప్పులు.. వీడియో వైరల్
- మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ కాంబినేషన్‌లో సర్కారు వారి పాట
- ఇటీవలే కళావతి సాంగ్ విడుదల
- యూట్యూబ్‌లో ఈ పాటకు మిలియన్ల కొద్దీ వ్యూస్
ఈ పాటకు తాజాగా మహేశ్ బాబు కూతురు సితార అదిరేటి స్టెప్పులు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సితార వేసిన స్టెప్పులపై మహేశ్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా, ఈ సినిమా పరశురామ్ దర్శకత్వంలో జీఎంబీ ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించాయి.