Hyderabad: హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాదులో ఓ బీటెక్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మృతురాలు శేరిలింగంపల్లి డివిజన్ లోని దుబే కాలనీలో ఉంటోంది. బాచుపల్లిలోని డీఆర్కే కాలేజీలో బీటెక్ చదువుతోంది.

నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Btech
Student
Suicide

More Telugu News