'భీమ్లా నాయక్' సినిమా కోసం టికెట్కు డబ్బులు ఇవ్వలేదని సూసైడ్ చేసుకున్న బాలుడు
- జగిత్యాలలో విషాద ఘటన
- 8వ తరగతి చదువుతోన్న బాలుడు
- రూ.300 కావాలని తండ్రిని అడిగిన కొడుకు
- స్నేహితులు టికెట్లు బుక్ చేసుకుంటారని చెప్పిన బాలుడు
నవదీప్(11) అనే బాలుడు 8వ తరగతి విద్యార్థి భీమ్లా నాయక్ సినిమా టికెట్ బుకింగ్ కోసం తన తండ్రిని 300 రూపాయలు అడిగాడు. తన స్నేహితులు కూడా ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారని చెప్పాడు. అయితే, తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన నవదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.