జగన్ గారూ, సినిమా టికెట్ ధరలు తగ్గేదేలే అన్నారట.. నిజమా?: వర్ల రామయ్య
- పేదలు కూడా పెద్ద సినిమాలు చూడాలని టికెట్ ధరలు తగ్గించారు
- సినిమా పెద్దలను కలిసిన తర్వాత అంత మార్పా సార్?
- ఏమిటీ మతలబు?
ఇటీవల చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ వంటి సినీ ప్రముఖులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తమ సమస్యల పట్ల సీఎం సానుకూలంగా స్పందించారని భేటీ తర్వాత సినీ ప్రముఖులు తెలిపారు.