'మాస్టర్' కాంబినేషన్లో మరో మూవీ!

Vijay in Lokesh Kanagaraj Movie
  • 'మాస్టర్' తో హిట్ కొట్టిన విజయ్
  • అదే దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
  • త్వరలోనే పట్టాలపైకి
  • మళ్లీ విలన్ గానే విజయ్ సేతుపతి  
తమిళంలో దర్శకుడిగా మురుగదాస్ తరువాత ఆ స్థాయిలో వినిపిస్తున్న పేరు లోకేశ్ కనగరాజ్. ఆయన దర్శకత్వంలో వచ్చిన కార్తి 'ఖైదీ' సినిమా తమిళంతో పాటు తెలుగులోను సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత ఆయన చేసిన 'మాస్టర్' కూడా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది.

ఈ సినిమాలో హీరోగా విజయ్ .. విలన్ గా విజయ్ సేతుపతి నువ్వా? నేనా? అన్నట్టుగా తలపడ్డారు. విజయ్ తో పాటు సమానమైన క్రేజ్ ను విజయ్ సేతుపతికి కూడా తెచ్చిపెట్టిన సినిమా ఇది. అలాంటి ఈ కాంబినేషన్లో మరో సినిమా రూపొందే అవకాశాలు ఉన్నాయనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.

ఇప్పటికే లోకేశ్ కనగరాజ్ కథ వినిపించడం ..  విజయ్ .. విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. నిర్మాతగా కలైపులి థాను నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది చూడాలి.
Go Back to Shorts
Vijay
Vijay Sethupathi
Lokesh kanagaraj movie

More Telugu News