Chiranjeevi: ఎల్లుండి జగన్ తో మరోసారి భేటీ కానున్న చిరంజీవి

Chiranjeevi to meet Jagan on Feb 10
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి మరోసారి భేటీ కానున్నారు. ఈనెల 10వ తేదీన ముఖ్యమంత్రిని ఆయన కలవనున్నారు. చిరంజీవితో పాటు మరో ఐదుగురు సినీ ప్రముఖులు సీఎంతో సమావేశం కానున్నారు. టికెట్ ధరలతో పాటు, సినీ పరిశ్రమ సమస్యలపై వీరు చర్చించనున్నారు. వాస్తవానికి ఈరోజు జగన్ తో భేటీ కావాలని చిరంజీవి భావించారు. అయితే ఇండస్ట్రీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో సమావేశం 10వ తేదీకి వాయిదా పడింది.

నెల రోజుల వ్యవధిలో జగన్ తో చిరంజీవి భేటీ కానుండటం ఇది రెండో సారి. జనవరి 13న తాడేపల్లిలోని జగన్ నివాసానికి చిరంజీవి వెళ్లారు. అప్పుడు ఆయన సింగిల్ గానే వెళ్లడం తెలిసిందే. ఈ సారి సమావేశం తర్వాత ఇండస్ట్రీ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని అందరూ ఆశాభావంతో ఉన్నారు.
Go Back to Shorts
Chiranjeevi
Jagan
Meeting
YSRCP
Tollywood

More Telugu News