సరిగ్గా పవన్ కల్యాణ్ సినిమా విడుదలకు ముందు టికెట్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు: ఏపీ ప్రభుత్వంపై కనకమేడల విమర్శలు
- రాజ్యసభలో కనకమేడల ప్రసంగం
- ఏపీలో అరాచకపాలన నడుస్తోందని వ్యాఖ్యలు
- వ్యాపార వాతావరణం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు
ఓ ప్రాంతీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్న పవన్ కల్యాణ్ నటించిన కొత్త చిత్రం విడుదల కావాల్సి ఉండగా, సరిగ్గా అదే సమయంలో టికెట్ల ధరల క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని కనకమేడల వివరించారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదం అయిందని, ఈ కారణంగా అనేక సినిమాలు విడుదల కాలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని సమస్యలున్నా పనిగట్టుకుని మరీ టికెట్ ధరలపైనే ఫోకస్ చేస్తోందని ఆరోపించారు.