నావల్ల కాదు నువ్వే రాజీనామా చేయి అని సీఎం జగన్ అనాలి... అప్పుడే నా రాజీనామా: రఘురామకృష్ణరాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నావల్ల కాదు నువ్వే రాజీనామా చేయి అని సీఎం జగన్ అనాలి... అప్పుడే నా రాజీనామా: రఘురామకృష్ణరాజు

Raghurama talks about resignation issue
  • రఘురామపై అనర్హత వేటుకు వైసీపీ తీవ్ర యత్నాలు
  • రాజీనామా చేయాలంటూ డిమాండ్
  • ఈ నెల 11 వరకు సమయం ఇచ్చానన్న రఘురామ
వైసీపీతో ఎంపీ రఘురామకృష్ణరాజు పోరాటం కొనసాగుతోంది. ఆయనపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పార్టీకి ఆయన రాజీనామా చేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రఘురామ స్పందించారు. ఫిబ్రవరి 5న తాను రాజీనామా చేస్తానని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.

అయితే, తనపై అనర్హత వేటుకు ఈ నెల 11 వరకు వైసీపీ నేతలకు సమయం ఇచ్చానని వెల్లడించారు. ఒకవేళ... ఇక నా వల్ల కాదు, నువ్వే రాజీనామా చేయి అని సీఎం జగన్ చెబితే అప్పుడు రాజీనామా చేస్తానని రఘురామ వివరించారు. రాజీనామా విషయంలో తాను స్పష్టతతోనే ఉన్నానని ఉద్ఘాటించారు.
Raghurama
Resignation
YSRCP
CM Jagan
Andhra Pradesh

More Telugu News