రామ్ తో రంగంలోకి దిగుతున్న బోయపాటి!

Ram in Boyapati movie
  • 'అఖండ'తో హిట్ కొట్టిన బోయపాటి
  • బన్నీతో చేయవలసిన సినిమా వాయిదా
  • రామ్ ప్రాజెక్టుపైనే పూర్తి దృష్టి
  • ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్
బాలకృష్ణ హీరోగా 'అఖండ' సినిమాతో .. కొట్టిన హ్యాట్రిక్ హిట్ తో .. రికార్డు స్థాయిలో రాబట్టిన వసూళ్లతో బోయపాటి క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. దర్శకుడిగా బోయపాటి సత్తా ఏమిటనేది ఈ సినిమా చాటిచెప్పింది. ఈ సినిమా తరువాత బన్నీతో బోయపాటి సినిమా ఉండనుందనే టాక్ వచ్చింది. అయితే ఆ సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది.

'పుష్ప' సంచలనం చూసిన బన్నీ .. సీక్వెల్ కూడా వెంటనే చేయాలని నిర్ణయించుకోవడం వలన, గీతా ఆర్ట్స్ లో బోయపాటి చేయవలసిన సినిమా వాయిదా పడింది. దాంతో ఆయన రామ్ తో రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. అందుకు సంబంధించిన పనుల్లోనే బోయపాటి ఉన్నాడని చెబుతున్నారు.  

ప్రస్తుతం రామ్ .. లింగుసామి దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'ది వారియర్' అనే టైటిల్ ను ఇటీవలే ఖాయం చేశారు. పోలీస్ ఆఫీసర్ గా రామ్ చేస్తున్న ఈ సినిమాలో ఆయన జోడీగా కృతిశెట్టి సందడి చేయనుంది. చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Ram
Boyapati Sreenu
Lingusamy

More Telugu News