'అశోకవనంలో అర్జున కల్యాణం' రిలీజ్ డేట్ ఖరారు!

Ashokavanamalo arjuna Kalyanam release date confirmed
షార్ట్స్‌లో చూడండి
విష్వక్సేన్ ఇంతవరకూ యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆయన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ కి కూడా ఆ తరహా కథలకి బాగా సెట్ అయింది. అయితే ఈ సారి ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే 'అశోకవనంలో అర్జున కల్యాణం' చేశాడు.

టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమాకి విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించాడు. బాపినీడు - సుధీర్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరించారు. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. మార్చి 4వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు.

 జై క్రిష్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. విష్వక్సేన్ జోడీగా రుక్సార్ థిల్లోన్ అలరించనుంది. 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన రుక్సార్, ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి. 
Go Back to Shorts
Vishwak Sen
Rukshar Dhillon
Ashokavanamalo arjuna kalyanam Movie

More Telugu News