ముచ్చింతల్ లోని శ్రీరామనగరానికి చేరుకున్న ప్రధాని మోదీ
- హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని
- కాసేపట్లో సమతామూర్తి విగ్రహావిష్కరణ
- 216 అడుగుల ఎత్తుతో రామానుజాచార్యుల విగ్రహ నిర్మాణం
ముచ్చింతల్ లో 45 ఎకరాల విస్తీర్ణంలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్మాణం జరుపుకుంది. 2014లో సమతామూర్తి కేంద్రానికి శంకుస్థాపన జరిగింది. దాదాపు రూ.12 వందల కోట్లతో నిర్మాణం పూర్తిచేసుకుంది. ఇందులో భాగంగా పంచలోహాలతో కూడిన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహం ఎత్తు 216 అడుగులు. విగ్రహం దిగువన మూడంతస్తుల నిర్మాణం ఉంటుంది.