విషవాయువుల గనిగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్.. గంటకు 6 టన్నుల మీథేన్ విడుదల
- జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై కాలిఫోర్నియా వర్సిటీ సంచలన నివేదిక
- ప్రపంచంలో అత్యధిక మీథేన్ వెలువరించే ప్రాంతాల్లో యార్డ్‌కు 4వ స్థానం
- గంటకు 5.9 టన్నుల మీథేన్ విడుదల.. 10 లక్షల కార్ల కాలుష్యంతో సమానం
- నిర్వహణ లోపంతో లక్ష టన్నుల చెత్త పేరుకుపోవడమే ప్రధాన కారణం
- చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని నిపుణుల ఆందోళన
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్.. విషవాయువుల గనిగా మారిందని, ఇది హైదరాబాద్ నగరానికి పెను ముప్పుగా పరిణమించిందని ఓ అంతర్జాతీయ నివేదిక హెచ్చరించింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (లాస్ ఏంజెలెస్) సాఫ్ట్ మీథేన్ ప్రాజెక్టులో భాగంగా జరిపిన పరిశీలనలో ఈ యార్డ్ నుంచి గంటకు 5.9 టన్నుల మీథేన్ గ్యాస్ వెలువడుతున్నట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మీథేన్ ఉద్గారాలు వెలువడుతున్న 25 ప్రాంతాల్లో జవహర్‌నగర్ నాలుగో స్థానంలో నిలవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ యార్డ్ వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని స్థానికులు ఏళ్లుగా చేస్తున్న ఆరోపణలకు ఈ నివేదిక బలం చేకూర్చింది.
నిపుణుల అంచనా ప్రకారం జవహర్‌నగర్ నుంచి వెలువడుతున్న మీథేన్ ఉద్గారాలు... ఏకకాలంలో 10 లక్షల కార్లు ప్రయాణించినా లేదా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బొగ్గును మండించినా వెలువడే కాలుష్యంతో సమానం. ఈ జాబితాలో ముంబైలోని ఓ డంపింగ్ యార్డ్ గంటకు 4.9 టన్నుల మీథేన్‌తో 12వ స్థానంలో ఉంది. వ్యర్థాల నిర్వహణ శాస్త్రీయంగా జరుగుతోందంటూ జీహెచ్‌ఎంసీ, రాంకీ ఎన్విరో సంస్థలు చేస్తున్న ప్రకటనలు పూర్తిగా అవాస్తవమని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం నగరంలోని మూడు కార్పొరేషన్ల నుంచి రోజూ సగటున 9,600 టన్నుల చెత్త జవహర్‌నగర్‌కు చేరుతోంది. అయితే, అక్కడ ఉన్న యంత్రాల సామర్థ్యం రోజుకు కేవలం 1000 నుంచి 1200 టన్నుల చెత్తను మాత్రమే వేరు చేయగలదు. దీంతో తడి, పొడి చెత్తను వేరు చేయకుండానే కుప్పలుగా పోస్తున్నారు. ఫలితంగా యార్డులో నిత్యం 80 వేల నుంచి లక్ష టన్నుల చెత్త పేరుకుపోయి, దాని నుంచి భారీగా మీథేన్ గ్యాస్ విడుదలవుతోంది.
ఈ మీథేన్ వాయువు కార్బన్ డయాక్సైడ్ కంటే 25 రెట్లు అధికంగా భూతాపానికి కారణమవుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల గాలిలో ఆక్సిజన్ తగ్గి తలతిరగడం, శ్వాస సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మీథేన్‌కు మండే స్వభావం ఉండటంతో భారీ అగ్నిప్రమాదాలు జరిగే ముప్పు కూడా పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.