'సన్నాఫ్ ఇండియా' రిలీజ్ డేట్ ఖరారు!
- దేశభక్తి నేపథ్యంలో 'సన్నాఫ్ ఇండియా'
- ఇళయరాజా సంగీతం ప్రత్యేకమైన ఆకర్షణ
- కీలకమైన పాత్రలో శ్రీకాంత్
- ఈ నెల 18వ తేదీన విడుదల
దేశభక్తికి సంబంధించిన సినిమాల్లో మోహన్ బాబు డైలాగ్స్ మరింత పవర్ఫుల్ గా ఉంటాయని కూడా ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఇక డైలాగ్స్ రాయడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ఈ సినిమాకి దర్శకత్వం కూడా చేశాడు. ఇప్పటికే మోహన్ బాబు లుక్ కి మంచి మార్కులు పడిపోయాయి.
ఈ సినిమా విడుదలకు ముస్తాబై కొంతకాలమవుతోంది. కరోనా కారణంగా సరైన విడుదల సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చిన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. శ్రీకాంత్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
.