Vishwak Sen: 'అశోక వనంలో అర్జున కల్యాణం' టీజర్ రిలీజ్!

Ashokavanamlo Arjuna kalyanam Teaser Released
షార్ట్స్‌లో చూడండి
విష్వక్సేన్ మొదటి నుంచి కూడా యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను అలరించే కథలను ఎంచుకుంటూ వచ్చాడు. రఫ్ లుక్ తో .. అదే తరహా బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సారి ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతును కూడగట్టే పనిలో పడ్డాడు. అందులో భాగంగానే ఆయన 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాను చేశాడు.

బీవీఎస్ ఎన్ ప్రసాద్ సమర్పిస్తున్న ఈ సినిమాకి విద్యాసాగర్ దర్శకత్వం వహించాడు. విష్వక్ సేన్ జోడీగా రుక్సార్ థిల్లోన్ కథానాయికగా సందడి చేయనుంది. జై క్రిష్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను మార్చి 4వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

కథానాయకుడు పెళ్లి విషయంలో చేయవలసిన ఆలస్యమంతా చేస్తాడు. ఆ తరువాత త్వరగా అమ్మాయిని సెట్ చేసుకోవాలని ఆత్రుతపడుతుంటాడు. ఈ నేపథ్యంలోనే గోదావరి జిల్లా అమ్మాయిని చూడటానికి అక్కడికి వెళతాడు. అక్కడ చోటుచేసుకునే సంఘటనల సమాహారమే ఈ సినిమా కథ అనే విషయం టీజర్ వలన అర్థమవుతోంది.
Go Back to Shorts
Vishwak Sen

More Telugu News