చైనా సైనికులు నా చేతులు కట్టేసి.. ఎలక్ట్రిక్ షాక్ లు ఇచ్చారు: అరుణాచల్ బాలుడు
- మొహానికి వస్త్రాన్ని కట్టేశారు
- ఆర్మీ క్యాంప్ కు తీసుకెళ్లారు
- కొట్టారు, హింసించారు
- రెండో రోజు నుంచి నన్ను హింసించలేదు
మిరమ్ తరోన్ తన అనుభవాలను ఓ మీడియా సంస్థతో పంచుకున్నాడు. ‘‘మొదటి రోజు చైనా సైనికులు నా చేతులను తాళ్లతో కట్టి అడవుల్లోకి తీసుకెళ్లారు. మొహానికి వస్త్రాన్ని కట్టి, అక్కడి నుంచి ఆర్మీ క్యాంప్ కు తీసుకెళ్లారు. హింసించారు. కొట్టారు. ఎలక్ట్రిక్ షాక్ లు ఇచ్చారు. కానీ అది మొదటి రోజుకే పరిమితం. రెండో రోజు నుంచి నన్ను హింసించలేదు. ఆహారంతోపాటు, నీరు కూడా ఇచ్చారు’’ అని చెప్పాడు.