రామ్ హీరోగా బోయపాటి మూవీ!
Add ap7am to your home Screen

రామ్ హీరోగా బోయపాటి మూవీ!

Ram in Boyapati movie
  • రామ్ తాజా చిత్రంగా 'ది వారియర్'
  • లింగుసామి దర్శకత్వంలో సెట్స్ పైకి
  • నెక్స్ట్ మూవీ బోయపాటితో
  • నిర్మాతగా మిర్యాల రవీందర్ రెడ్డి
మొత్తానికి బోయపాటి తాను అనుకున్నట్టుగానే .. చెప్పినట్టుగానే బాలకృష్ణతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఆయన తాజా చిత్రంగా వచ్చిన 'అఖండ' 103 థియేటర్స్ లో 50 రోజులను పూర్తిచేసుకుని, 200 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. ఆ తరువాత సినిమాను ఆయన బన్నీతో చేయవలసి ఉంది.

అయితే ముందుగా అనుకున్నట్టుగా బన్నీ 'పుష్ప 2' కోసం గ్యాప్ తీసుకోదలచుకోలేదు. త్వరలోనే ఆయన ఈ సినిమా కోసం మళ్లీ సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. దాంతో బోయపాటి మరో ప్రాజెక్టుపై దృష్టి పెట్టవలసి వచ్చింది. ఆయన ఏ హీరోతో చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో, రామ్ హీరోగా ఆయన ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా ఇప్పుడు  వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రామ్ .. లింగుసామి దర్శకత్వంలో 'ది వారియర్' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమా బోయపాటితోనే ఉందని అంటున్నారు. ఈ సినిమాకి కూడా మిర్యాల రవీందర్ రెడ్డినే నిర్మాతగా వ్యవహరించనున్నాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Ram
Lingusamy
Boyapati Movie

More Telugu News