ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ 30 రోజులు ఉండాల్సిందే: ట్రాయ్
- ప్రస్తుతం 28 రోజుల కాలపరిమితి
- సంవత్సరానికి 13 సార్లు రీచార్జ్
- తాజా నిర్ణయం వల్ల తగ్గనున్న రీచార్జ్‌ల సంఖ్య
- 60 రోజుల్లోపు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశం
ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి సంస్థ 30 రోజుల కాలపరిమితితో ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌లను తీసుకురావాలని ఆదేశించింది. ఇందులో ప్లాన్ ఓచర్, ఒక స్పెషల్ టారిఫ్ ఓచర్, కాంబో వోచర్లు ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి నెల ఒకే తేదీన వీటిని రీచార్జ్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలని ఆదేశించింది. అంతేకాదు, రెండు నెలల్లోపు తమ ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది.