కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలి: తెలంగాణ నేత వీహెచ్ డిమాండ్
- ఉమ్మడి ఏపీ సీఎంగా సంజీవయ్య ఎంతో చేశారు
- కర్నూలు జిల్లాకు చెందిన సంజీవయ్య పేరును ఆ జిల్లాకు పెట్టాలి
- సంజీవయ్య పేరు పెట్టాలనే ఆలోచన రాకపోవడం సిగ్గుచేటు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ఎంతో చేశారని వీహెచ్ కొనియాడారు. కర్నూలు జిల్లాకు చెందిన సంజీవయ్య పేరును ఆ జిల్లాకు పెట్టాలని చెప్పారు. కడపకు వైయస్సార్, విజయవాడకు ఎన్టీఆర్, మన్యం ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన జగన్ కు... దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలనే ఆలోచన రాకపోవడం సిగ్గు చేటని అన్నారు. జగన్ దీనిపై పునరాలోచించాలని.. కర్నూలుకు సంజీవయ్య పేరు పెట్టాలని సూచించారు.