అప్పటికి మీ పార్టీ ఇంకా పుట్టలేదు.. మీ సభ్యుడు బీజేపీ టికెట్ పై పోటీ చేశాడు: థాకరే వ్యాఖ్యలపై ఫడ్నవిస్ ఘాటు స్పందన
- రాజకీయ అవసరాలకు బీజేపీ హిందుత్వను వాడుకుంటోందన్న థాకరే
- ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పాతికేళ్లు వృథా చేసుకున్నామని వ్యాఖ్య
- థాకరే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారన్న ఫడ్నవిస్
శివసేన కేవలం వారికి అవసరమైన విషయాలను మాత్రమే గుర్తుంచుకుందని ఆయన ఎద్దేవా చేశారు. ముంబై పురపాలక సంస్థలో బీజేపీ సభ్యులు ఉన్న సమయంలో శివసేన అప్పటికి ఇంకా పుట్టలేదని అన్నారు. 1984 ఎన్నికల్లో శివసేన సభ్యుడు బీజేపీ టికెట్ పై పోటీ చేశారని తెలిపారు.
ఇటీవల జరిగిన నగర పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన నాలుగో స్థానానికి పరిమితమైందని... ఈ ఫలితాలతో థాకరే తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారని, అందుకే ఏదో మాట్లాడుతున్నారని ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. రామ జన్మభూమి పోరాటం జరుగుతున్న సమయంలో మీరెక్కడున్నారని ప్రశ్నించారు. తాము తూటాలను, లాఠీ దెబ్బలను ఎదుర్కొన్నామని చెప్పారు. ఈరోజు ప్రధాని మోదీ నాయకత్వంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోందని అన్నారు.