Kerala: మలయాళ హీరోయిన్ పై అత్యాచారం కేసు.. పోలీసుల విచారణకు హాజరైన హీరో

Malayali Hero Appears Before Crime Branch Police
షార్ట్స్‌లో చూడండి
మలయాళ హీరో దిలీప్ క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ప్రముఖ మలయాళ హీరోయిన్ పై అత్యాచార కేసులో అతడు విచారణకు వచ్చాడు. కేసులో కేరళ హైకోర్టు అతడికి అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో అతడు ఇవాళ కళామసేరి పోలీసుల విచారణకు వచ్చాడు. కేసులో నిందితులుగా ఉన్న అతడి సోదరుడు అనూప్, బావ సూరజ్ అతడితో పాటు వచ్చారు.

2017 ఫిబ్రవరి 17న మలయాళ హీరోయిన్ ను కిడ్నాప్ చేసి కారులో ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారులను బెదిరించేందుకు దిలీప్ కుట్ర పన్నాడంటూ అధికారులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన ఆడియో క్లిప్ కూడా ఒకటి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అతడిపై ఓ విచారణాధికారి ఫిర్యాదు చేశారు. జనవరి 9న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులోనే దిలీప్ ఇప్పుడు విచారణకు హాజరయ్యాడు.
Go Back to Shorts
Kerala
Dileep
Rape
Crime Branch
Police

More Telugu News