కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు.. అన్ని ట్రెజరీలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
- జీతాల్లో మార్పులు చేయాలని ఉత్తర్వులు
- కొత్త సాఫ్ట్ వేర్ ను సిద్ధం చేస్తున్న సీఎఫ్ఎంఎస్
- ఆందోళనలను ఉద్ధృతం చేయనున్న ఉద్యోగులు
- రేపు సీఎస్ ను కలిసి సమ్మె నోటీసులిచ్చే అవకాశం
అయితే, జీవోను వెనక్కు తీసుకోవాలంటూ ఇవాళ ఇప్పటికే ఉపాధ్యాయులు కలెక్టరేట్లను ముట్టడించారు. చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఉద్యోగులు కూడా ఆందోళనలను ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న వారు.. రేపు సీఎస్ సమీర్ శర్మను కలిసి ముందస్తు సమ్మె నోటీసును ఇవ్వనున్నారు.
నిబంధనల ప్రకారం 14 రోజుల ముందే సమ్మె నోటీసు ఇవ్వాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి ఐక్యవేదికలు ఇవాళ నిర్వహించే సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నాయి.