పవన్ తో తలపడే విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో!

Bhavadeeyudu Bhagath Singh movie update
  • రిలీజ్ కి రెడీగా 'భీమ్లా నాయక్'
  • సెట్స్ పై ఉన్న 'వీరమల్లు'
  • లైన్లో హరీశ్ శంకర్
  • 'భవదీయుడు భగత్ సింగ్'కి సన్నాహాలు  
పవన్ కల్యాణ్ తాజా చిత్రమైన 'భీమ్లా నాయక్' విడుదలకి రెడీగా ఉంది. ఫిబ్రవరి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు వచ్చేస్తుంది. ఇక అదే పరిస్థితులను బట్టే 'హరి హర వీరమల్లు' సినిమా కూడా తాజా షెడ్యూల్ నిమిత్తం సెట్స్ పైకి వెళుతుంది.

ఆ తరువాత సినిమాను హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా చకచకా జరిగిపోతున్నాయి. 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుంది. ప్రతినాయకుడి పాత్రను హరీశ్ చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశాడట.

విలన్ పాత్రకి విజయ్ సేతుపతి అయితే కరెక్టుగా సరిపోతాడని భావించి, ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. 'మాస్టర్' .. 'ఉప్పెన' సినిమాలతో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 'గబ్బర్ సింగ్' కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Go Back to Shorts
Pavan
Pooja Hegde
Harish Shankar
Bhavadeeyudu Bhagath Singh MOvie

More Telugu News